Accident:భారతదేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదంలో మరణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులో ఎక్కువగా మోటార్ సైకిల్ మీద వెళ్లే వారే ఎక్కువగా మరనిస్తున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మితి మీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్న కూడా కొన్ని సందర్భాలలో ఎదుటి వాడి తప్పిదాల వల్ల కూడా ప్రమాదాల బారిన పడేవారు అనేకం. వారి తప్పిదం అయిన, ఎదుటి వారి తమ్మిడం అయిన కూడా చాలా మంది యువకులు అర్ధాంతరంగా వారి బంగారు భవిష్యత్తును వదిలి వెళ్ళి పోవడం చాలా బాధాకరం.
నిత్యం దేశంలో గంటకు 51 ప్రమాదాలు జరుగుతుండగా అందులో 17 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అతివేగం వలనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలో పొందుపరిచారు. అతివేగం కారణంగా 71% ప్రమాదాలు జరుగుతున్నట్లు, అందులో 67.8 % మంది మరనీస్తున్నారు, 72.4% మంది గాయాల పాలవుతున్నారు. ఏది ఏమైనా వారిని నమ్ముకున్న వారు రోడ్డున పడుతున్నారు. ఎంతో మంది కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను అర్థంతరంగా కోల్పోతున్నారు.
ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వ్యక్తి విగతజీవిగా మారిపోయాడు. సోమశేఖర్ అనే వ్యక్తికి ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల నిమిత్తం సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు నందికొట్కూరు నుండి వడ్డెమాను బైక్ పై వెళుతున్నారు. అయితే వారిని కాలం చిన్నచూపు చూసింది, నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీకొని సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదు రోజుల పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన వ్యక్తి మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరి మరణం తో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.