ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగ ఖాళీల దిశగా అడుగులు పడుతున్నాయి. కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనుండగా మరికొన్ని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
మొత్తం 33 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 24 ఉండగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ ఖాళీలు 3, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.
పోస్ట్‌మార్టం అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉండగా పోస్టు, ప్లంబర్ ఉద్యోగ ఖాళీ 1, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీ 1 ఉన్నాయి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. అకాడమిక్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. డీసీహెచ్‌ఎస్ కర్నూలు కార్యాలయం, డీఎంహెచ్‌వో ఆఫీస్ దగ్గర, కర్నూలు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరై ఎంపికన అభ్యర్థులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.