Jabardasth Show : అందరి ముందు స్టేజి మీదే అజర్ పరువు తీసేసిన రీతూ..!

Jabardasth Show: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా పరిచయం ఇండస్ట్రీకి అయి బాగా పాపులర్ అయ్యారు. కమెడియన్లుగా మాత్రమే కాకుండా జంటలుగా కూడా ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. అటువంటి వారిలో మొదటి జంట సుధీర్, రష్మి. వీరిద్దరు ఆన్ స్క్రీన్ మీద చేస్ స్కీట్లు, రొమాంటిక్ పర్ఫార్మెన్స్ వల్ల వీరిద్దరు నిజంగా రిలేషన్ లో ఉన్నారని చాలామంది భావించారు. అయితే అది కేవలం స్క్రీన్ మీద మాత్రమే అని తేలిపోయింది.

వీరి తర్వాత బాగా ఫేమస్ అయిన జంటల్లో వర్ష, ఇమాన్యుల్ జంట కూడా ఒకటి. వీరిద్దరు పలు టీవీ షోలలో చాలా చనువుగా స్కిట్ చేయటం వల్ల వీరు కూడ బాగా పాపులర్ అయ్యారు. అయితే వీరి లాగా మరో రెండు జంటలను కూడా మల్లెమాల వారు బాగా ఫేమస్ చేశారు. రాకింగ్ రాకేష్,సుజాత జంట కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారని కూడ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అజర్,రీతూ జంట కూడా బాగా పాపులర్ అయ్యారు.

వీరిద్దరూ ఈమధ్య ఎక్కువగా జబర్దస్త్ లో కలసి స్కిట్లు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల వీరిద్దరు కూడ జంటగా బాగా పాపులర్ అవ్వటంతో మల్లెమాల వారు కూడ వీరిని బాగ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆది జబర్దస్త్ లో స్కిట్ లు చేయకపోవడంతో అజర్ నీ టీమ్ లీడర్ గా నియమించారు. అయితే అజర్ మాత్రం టీమ్ లీడర్ గా నిలదొక్కుకోలేక పోతున్నాడు. జబర్థస్త్ లో అజర్, రీతూ కలసి చేసిన స్కిట్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో అజర్ ని చూసి నన్నేం చేయకు అని భయపడుతుంటుంది. అప్పుడు రీతూ వచ్చి ఇంత పెద్ద స్కిట్ ఇస్తేనే ఏమీ చేయలేకపోతున్నాడు.. ఇక నిన్నేం చేస్తాడు అని కౌంటర్ వేస్తుంది.దీంతో అందరూ పగలబడి నవ్వుతారు.