Crime News: పెరుగుతున్న నిరుద్యోగ సమస్య.. ఆదాయ మార్గాలు లేక ఆత్మహత్యలు..!

Crime News: ప్రస్తుతం దేశంలో అక్షరాస్యత పెరిగి నిరుద్యోగ సమస్య తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా క్ లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని జీవించేవారు వారి ఆదాయ మార్గాలను కోల్పోయారు. లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది సంపాదన లేక ఎంతోమంది కి కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబాన్ని పోషించేందుకు డబ్బు సంపాదించే మార్గాలు దొరకక చాలామంది అప్పులు చేసి వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

డబ్బు సంపాదన పై ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ పని చేసుకుంటూ డబ్బులు సంపాదించే వారు కానీ కరోనా లాక్డౌన్ పడటంతో సొంత గూటికి చేరుకున్నారు. కరోనా వల్ల ఎంతోమంది బాగు పడినప్పటికీ అంతకి రెట్టింపు మంది తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్య కారణంగా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరుణ విజృంభణ వల్ల 2018-రెండువేల ఇరవై సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 25251 ప్రజలు ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018-2020 అభిమానం దాదాపు 16 వేల మంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోగా..9140 మంది నిరుద్యోగ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ తరహా ఆత్మహత్యలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యలకు పాల్పడే వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.