కొత్తజీవితం మొదలు పెట్టిన రియాజ్… అసలు కారణం ఏమిటో తెలుసా…?

అదిరింది కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రియాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా ఫేమస్ అయిన రియాజ్ మా టీవీలో ప్రసారమైన అదిరింది షో లో అవకాశం దక్కించుకున్నాడు. అదిరింది షో లో సద్దాం హుస్సేన్ టీంతో కలిసి కొన్ని స్కిట్స్ చేసి మంచి ఫేమస్ అయ్యారు.అందులో ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని అనుకరిస్తూ చేసిన కొన్ని స్కిట్ ల ద్వార ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ వైసీపి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో మీడియా ముఖంగా రియాజ్ క్షమాపణలు చెప్పాడు.

రియాజ్ షోస్ తో పాటు కొన్ని వెబ్ సిరీస్, సినిమాలలో కూడా నటించాడు. అయితే రియాజ్ నటించిన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఇతడు నటించిన వెబ్ సిరీస్ లు మాత్రం ఓటిటిలో ప్రసారమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రియాజ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు రియాజ్ వివాహం చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. భార్యతో కలసి తన కొత్త జీవితం మొదలుపెట్టాడు. రియాజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంకా సోషల్ మీడియాలో కనిపించటంలేదు.

కానీ రియాజ్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఇటీవల రియాజ్ ఇంట్లో వేడుక జరిగినట్టు సమాచారం. ఆ వేడుకకు సంబందించిన ఒక వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు రియాజ్ కాళ్ళకి నమస్కరిస్తూ అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. రియాజ్ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ తో పాటు ఇటు కమెడియన్ గా వరుస అవకాశాలు రావటంతో ఫుల్ బిజీగా ఉన్నారు.