దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం తాను చేసే సినిమాలు కోసం గాని తెలుగు ఆడియెన్స్ కి మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక నాడు ఎన్నో సూపర్ సినిమాలు తీసే తాను ఇప్పుడు ఎవరో చెప్పు చేతల్లో కొన్ని కాంట్రవర్సియల్ సినిమాలు తీసుకునే పరిస్థితికి వచ్చేసాడు.
దాదాపు అయితే కొన్ని టార్గెట్ చేసే సినిమాలే తాను చేస్తుండగా వాటిలో టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ పై సినిమాలు చేయడం తన పాత్రలు ఇమడ్చడం వంటివి షాకింగ్ గా మారాయి. మరి గత కరోనా టైం లో కూడా పవన్ పై ఓ సినిమా చేసి కావాల్సినంత హైప్ ని తాను తెచుకున్నడు.
మరి ఫైనల్ అయితే ఇప్పుడు మరో షాకింగ్ సినిమా చేయడానికి డీల్ చేసుకున్నట్టుగా సినీ వర్గాల్లో విస్తృతంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలకే ఎన్నో సార్లు అడిగితే గాని దొరకని ఏపీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ వర్మ కి డైరెక్ట్ పిలుపు ఇచ్చి నలభై నిముషాలు కేటయించి మాట్లాడ్డం అనేది ఆసక్తిగా మారింది.
దీనితో ఈ మీట్ పవన్ కళ్యాణ్ పై సినిమా కోసమే అంటూ ఓ షాకింగ్ టాక్ మొదలైంది. సరిగ్గా ఎన్నికల ముందు పవన్ పై అందులోని తన మూడు పెళ్లిళ్లపై సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో రచ్చ వినిపిస్తుంది. మరి ఇది నిజంగానే పవన్ పై సినిమా కోసమా లేక వేరే అంశం పైనా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.