RGV-Sandeep Vanga: టాలీవుడ్ హీరో, నటుడు, విలన్ జగపతి బాబు గురించి మనందరికి తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు చాలా సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో ఎక్కువగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షోకీ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. జీ తెలుగులో ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. తాజాగా ఈ షోకి గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా వచ్చి సందడి చేసారు. ఇలాంటి ఇద్దరు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడి అల్లరి చేసి సరదాగా నవ్వడంతో ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సందీప్ ఆర్జీవీ తన ఫేవరేట్ డైరెక్టర్ అని చాలా సార్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరు బోల్డ్ డైరెక్టర్స్ కలిసి షోలో ఏం చెప్పారో, ఎలా సందడి చేశారు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
