నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలంటున్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో కొన్ని విషయాలు పంచుకున్నాడు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జయశంకర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించాడు.

ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలని అన్నాడు. కేసీఆర్ చెప్పినట్లు ఎక్కడ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు అని అన్నాడు. కొందరికి రెండు పడక గదుల ఇల్లు కాదు కదా.. పూరి గుడిసె కూడా రాలేదని తెలిపాడు. ఇక రైతు సమస్యలపై చర్చించడం తో పాటు వాటి పరిష్కారాలు కూడా చూస్తామని తెలిపాడు.