ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అంటే గుర్తుచొచ్చే నాలుగురైదుగు నేతల్లో రేవంత్ రెడ్డి ఒకరు. ఏ పార్టీలో వున్నా కానీ అయన స్వరం గట్టిగానే వినిపిస్తుంది. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన రేవంత్ రెడ్డి గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉంటున్నాడు. రేవంత్ లాంటి మౌనంగా ఉండటంతో అయన నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి నీరసం ఆవహించినట్లు వుంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్ అన్నట్లు బ్యాక్ టు బ్యాక్ తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు.
హద్రాస్ ర్యాలీ సమయంలో రాహుల్ గాంధీకి జరిగిన అవమానాన్నీ నిరసిస్తూ నిన్న ఏకంగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయన్నీ ముట్టడించడానికి రేవంత్వె రెడ్డి వెళ్లటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ సెగ వేడెక్కింది. కాంగ్రెస్ , బీజేపీ శ్రేణులు మధ్య తోపులాటలు జరగటం, పోలీసులు రంగప్రవేశం చేయటం జరిగింది. అదే రోజు అధికార తెరాస పార్టీ అధినేత సీఎం కెసిఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటైన లేఖ రాయటం కూడా చర్చనీయాంశం అయ్యింది. ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణ పేట్-కొడంగల్ ఎత్తిపోతల అంశాన్ని కూడా చేర్చాలని కోరుతూ,మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసిన చందంగా కేసీఆర్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు.
కృష్ణా నది విషయంలో ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేసి తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారుతున్నాయన్నారు. మీది మూర్ఖత్వమా? లేక అతి తెలివా అర్థం కావడం లేదన్నారుఉమ్మడి ఏపీలో ఆమోదం పొందిన నారాయణ్ పేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు గ్రామాలకు తాగునీరు సదుపాయం కల్పించవచ్చని.. ఈ ప్రాజెక్టును అటకెక్కించారని కేసీఆర్ తీరును రేవంత్ ఎండగట్టారు. ఒకేరోజు రెండు పార్టీల మీద రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయటంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం వచ్చింది. మరికొద్ది రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అది దృష్టిలో పెట్టుకొనే రేవంత్ రెడ్డి ముందస్తు వ్యూహంతో ఇరు పార్టీలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది