వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

revanth reddy writes open letter to cm kcr

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపం చూపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ వరద సాయంపై ఆయన లేఖ ద్వారా స్పందించారు. తర్వాత ట్వీట్లు కూడా చేశారు. వరద బాధితులు ధర్నా చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

revanth reddy writes open letter to cm kcr
revanth reddy writes open letter to cm kcr

గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయని ఆయన సీఎం కేసీఆర్ కు తెలిపారు. బాధితుల సాయంలోనూ కమిషన్లు దండుకున్నారని… గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న దుర్బుద్దే ఈ కుంభకోణానికి కారణమన్నారు.

revanth reddy writes open letter to cm kcr
revanth reddy writes open letter to cm kcr

చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు కానీ.. మీ అత్యుత్సాహం వల్లనే పరిహారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన స్పష్టం చేశారు.

రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ చేయడం మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి. లేదంటే క్షేత్ర స్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.