Revanth Reddy: చంద్రబాబు ఇది గుర్తుపెట్టుకో.. మోడీ ఉంటే మీ ఆటలు సాగుతాయా.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో విపక్ష ఎంపీ భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

చంద్రబాబు నాయుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని కేంద్రంలో మోడీ ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని అనుకోవద్దని తెలిపారు.ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకోవడం వల్ల అవి పూర్తి కావని ఎద్దేవా చేశారు. గోదావరి బేసిన్ లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లోని 555 టీఎంసీలలో తెలంగాణలోని ప్రాజెక్టులు కట్టుకుంటామని.. ఇందుకు ఎన్ఓసీ ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లను ఏపీ తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

ఇక ఇదే విషయం గురించి బిఆర్ఎస్ నాయకులపై కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు. కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వివరించదలచుకున్నా. వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే పనిలో ఉన్నారని తెలిపారు.రైతాంగాన్ని కష్టాల నుంచి బయట పడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కేసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తాం. కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారని గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.