Tollywood: సినీ నిర్మాత కేదార్ మృతి ఇటు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే .అయితే ఈ దుబాయ్ పెళ్లి వేడుకలలో భాగంగా కేదార్ మరణించినట్లు తెలుస్తోంది. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో పలు సినిమాలను నిర్మించారు.
ఈ విధంగా కేదార్ పెళ్లి వేడుకలకని దుబాయ్ వెళ్లే అక్కడ మరణించడంతో ఈయన మరణం కాస్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్రమారం రేపింది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున మద్యం డ్రగ్స్ తీసుకొని ఉన్నారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకలలో కేదార్ తో పాటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా రోహిత్ రెడ్డి పేరు బయటకు రావడంతో ఈయన వెంటనే ఒక వీడియో విడుదల చేశారు తాను హైదరాబాదులోనే ఉన్నానని తెలియజేశారు అయితే ఈయన మరణం పై తెలంగాణ సర్కార్ సీరియస్ గా స్పందించింది. కేదార్ మరణం పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేదార్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు . తన స్నేహితుడు మరణిస్తే కేటీఆర్ కి ఎందుకని ఇప్పటివరకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.
ఇకపోతే డ్రగ్స్ కేసులో భాగంగా నిందితులుగా ఉన్న వారందరూ ఇలా ఒక్కొక్కరిగా మరణిస్తూ ఉండటం ఎన్నో అనుమానాలకు కారణమవుతుందని రేవంత్ రెడ్డి తెలియచేశారు. ఇక కేదార్ కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తే విచారణ జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే నిర్మాత మృతి బి ఆర్ ఎస్ మెడకు బిగుస్తోందని తెలుస్తోంది.
ఇక ఈయన నిర్మాతగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గంగం గణేష్ సినిమాకు వ్యవహరించారు. ఈయనకు బన్నీ వాసు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండతో చాలా మంచి అనుబంధం ఉంది. ఇలా యువ నిర్మాత మరణించడంతో ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.