కేసీఆర్ గాలి ఇలా తీసేశావేమిటి రేవంత్ రెడ్డి

Revanth Reddy satires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెటైర్ వేయడానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముందుంటారు.  కేసీఆర్ దేని గురించైతే గర్వంగా చెప్పుకుంటుంటారో దాన్నే బద్నాం చేయడం రేవంత్ అలవాటు.  రాజకీయాల్లో ఇది కూడ ఒక స్ట్రాటజీనే.  ఏ అంశాన్ని చెప్పి ప్రత్యర్థులు మైలేజ్ పొందుతూ ఉంటారో ఆ అంశమే బూటమని వాదిస్తే వాళ్ల ప్రచారానికి గండికొట్టవచ్చనేది ఇందులో లాజిక్.  కేసీఆర్ విషయంలో ఈ లాజిక్ ను నూటికి నూరు శాతం అమలుచేస్తుంటారు రేవంత్ రెడ్డి.  తెరాస ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటోంది.  ఢిల్లీలో తమ ఎంపీలు బిల్లును ఖండిస్తూ నిరసన తెలుపుతున్నారని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు.

Revanth Reddy satires on KCR
Revanth Reddy satires on KCR

మోదీ ప్రతిపాదిస్తున్న బిల్లు రైతుల పాలిట శరాఘాతమని, తాము రైతుల పక్షపాతం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లును ఒప్పుకోబోమని, జాతీయ స్థాయిలో నిరసన తెలుపుతామని గొప్పగా చెప్పుకుంటున్నారు.  కేసీఆర్ మాటలకు, కేటీఆర్ ట్వీట్లకు జనంలో రెస్పాన్స్ బాగానే వస్తోంది.  ఇంతలో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.  రాష్ట్ర స్థాయిలోనే కేసీఆర్ ను వదలని రేవంత్ నేషనల్ ఇష్యూ కాబట్టి మరింత రెచ్చిపోయారు.  కేసీఆర్ అంతా నాటకం ఆడుతున్నారని, ఆయన బీజేపీకి అనుకూలమని పెద్ద బండ వేశారు.  

తెరాస పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తూనే బయట షో చేస్తుందన్న రేవంత్ టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్ సభ చర్చలో పాల్గొనకుండా రాజ్యసభలో హడావిడి చేస్తూ బిల్డప్ ఇస్తున్నారని, నిజంగా తెరాసకు చిత్తశుద్ది ఉంటే, బిల్లును వ్యతిరేకిస్తే ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు.  బిల్లును వ్యతిరేకిస్తున్నది తామని, బిల్లుకు నిరసనగా ఈ నెల 25న రాష్ట్రంలో రైతులను కూడగట్టి ధర్నాలు చేస్తామని అన్నారు.  అన్నట్టే రేవంత్ నాయకత్వంలో ధర్నాలు విజయవంతమైతే కేసీఆర్ మాటల మనిషని, కాంగ్రెస్ చేతల్లో చూపుతుందని మరో సెటైర్ వేసేస్తారు రేవంత్.