కిషన్ రెడ్డి ఎందుకు అలా చేయట్లేదు? లాజిక్స్ తో బీజేపీ, తెరాసని ఆటాడుకున్న రేవంత్ రెడ్డి

revanth reddy fires onkishan reddy and bjp party

తెలంగాణ: టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన వరకు వస్తే గాని బీజేపీకి తత్వం బోధపడలేదని విమర్శించారు. బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆ పార్టీ నేతలు మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను పిలిచి సమీక్షించే అధికారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అయినా ఆయన ఆ పనిచేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

revanth reddy fires onkishan reddy and bjp party
revanth reddy fires on kishan reddy and bjp party

ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి ? అని అన్నారు. అసలు డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది ఐటీ శాఖ అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. పోలీసులకు సోదాలు చేసే అధికారం ఎక్కడిదని అన్నారు. ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రత్యేక సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. తమ సొంత ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు భద్రత కల్పించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సంజయ్‌ను మొదటిసారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదని.. కాబట్టే ఆయనను చంపేందుకు మళ్లీ ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.