C.M.Revanth Reddy: 2025 ఐపీఎల్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆర్సిబి విజయం సాధించడంతో పెద్ద ఎత్తున బెంగళూరు చిన్న స్వామి స్టేడియానికి అభిమానులు తరలివచ్చి విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొక్కిసలాట జరగడంతో సుమారు 11 మంది అభిమానులు మరణించారు. దీంతో ఈ ఘటనపై ఎంతోమంది స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పై తనదైన శైలిలోనే విమర్శలు కురిపించారు.హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఎవరి వైఫల్యం వల్ల జరిగిందనేది పక్కన పెడితే.. ఒక ప్రాణం పోయిందనేది వాస్తవం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ ను రాసి రంపాన పెట్టారు. సరిగ్గా ఇలాంటి ఘటన నిన్న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగింది.
11 మంది ప్రాణాలు కోల్పోయారు. సేమ్ అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే ముందు.. తప్పు ఎక్కడ జరిగింది అనేది వెతకాలి. ఆ తప్పు మళ్ళీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కక్ష సాధింపు ధోరణి సరైంది కాదని ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.ఇటువంటి దుర్ఘటనలు జరుగకుండా చూడాలి. భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.. బాధ్యతగా వ్యవహారించాలని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.