పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా టిఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశాడు. తాజాగా ఆయన ఓ మీడియా సమక్షంలో పాల్గొనగా.. అందులో కొన్ని విషయాలు పంచుకున్నాడు. కొండగల్ అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలి అని డిమాండ్ చేశాడు. మరణించిన ఒక రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించిన లేదని అన్నాడు.
గత ఎనిమిదేళ్లలో నుండి పేదలకు ఎటువంటి సహాయం అందలేదని.. వారి కుటుంబాల కోటీశ్వరులు అయ్యారని అన్నాడు. ఇక కేసీఆర్ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో లేరని.. ఒకరు ఢిల్లీకి వెళ్తే మరొకరు దావత్ కి వెళ్లారు అని అన్నాడు. ఇక వీరిద్దరూ లేకపోయేసరికి అందరి మొహాల్లో ఆనందం ఉందని.. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలి అంటే వారిద్దరిని రాష్ట్రం పొలిమేరలు దాటిచాలని అన్నాడు.