మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన దుష్ట పాలనలో తెలంగాణ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది అని అన్నారు. అంతేకాకుండా అప్పులు, భూముల అమ్మకాలు, చమురు ధరల పెంపుదల, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బస్ చార్జీలు, మద్యం అమ్మకాల ద్వారా జనాల ముక్కుపిండి వసూలు చేస్తున్న లక్షల కోట్లు సొమ్ములు ఎక్కడ పోతున్నాయి అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపండి అంటూ.. చిరుద్యోగులైన హోంగార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి పోయిన నెల జీతాలు విడుదల చేయాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. లేదంటే ఆయా వర్గాలకు కాంగ్రెస్ అండగా కార్యాచరణ ప్రకటిస్తుంది అని అన్నారు.