వర్మను విమర్శించే వారే కాదు.. ఆయన వింత వ్యవహారశైలిని ఇష్టపడే వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడిని ఇష్టపడే ఓ యువ రచయిత రేఖ పర్వతాల తాజాగా ‘వర్మ’పై ఓ పుస్తకాన్ని రాసింది. దాని పేరు ‘వర్మ మన ఖర్మ’. ఈ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వర్మ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఆవిష్కరించారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రేఖ పుస్తకం రాయడం నిజంగా సంతోషమన్నారు. తన గూర్చి ఏం రాశావు అని ఎప్పుడూ అడగలేదని ఆమె ఫ్యాషన్ ఆమెను పూర్తిచేసుకోమ్మన్నానని వివరించారు. తాను ఎప్పుడూ ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వనని నా కన్వినెంట్ ప్రకారం అవి మారుస్తుంటానన్నారు. ప్రతీ మనిషిలో ఒక మృగం రాక్షసుడు దాగి ఉంటారని దాన్ని బయటకు తీయడం తప్పు అని అందరూ అంటారని కాని మృగాన్ని బయటకు తీసి మనం చేయాలనుకున్నది చేయాలని తాను చెపుతానన్నారు.
బర్నింగ్ టాపిక్స్పై తాను సినిమాలు తీయనని మంటలు ఆరాక సినిమాలు తీస్తానని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. సమస్యల గూర్చి ఎప్పుడూ పట్టించుకోనని ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని కానీ బాధపడితే లాభం ఉండదని అన్నారు. తాను ఇప్పటివరకు మాస్క్ ధరించలేదని శానిటైజర్ వాడలేదని భౌతికదూరం పాటించలేదని కరోనా కోసం తన లైఫ్స్టైల్ను మార్చుకోనని తాను తనలాగే బతుకుతానని రామ్గోపాల్ వర్మ అన్నారు.
రచయిత్రి రేఖ మాట్లాడుతూ ఆర్జీవీ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన నాకు గురువు లాంటివారమని అన్నారు. నాకు కూడా ఆర్జీవీలా స్వతంత్రంగా బతకడం ఇష్టమన్నారు. అందుకే ఆయనపై పుస్తకం రాశానని అన్నారు.