ఏపీలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే వైసీపి దెబ్బకు ఖాళీ అవుతున్న టీడీపీని నిలబెట్టే ప్రయత్నాలు చంద్రబాబు గట్టిగానే చేస్తున్నారు.. అలా చేయకపోతే రానున్న కాలంలో టీడీపీలో నాయకులు మిగలరన్న విషయాన్ని బాబుగారు గ్రహించినట్లు ఉన్నారు.. ఇకపోతే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి యువత బలంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీకి అనుబంధ విభాగమైన తెలుగు యువత ముఖ్యపాత్ర పోషించేది. కానీ ప్రస్తుతం తెలుగు యువత అంటే సీనియర్ల వారసులు అనే ముద్ర పడిపోవడంతో ఈ పార్టీ వైపు యువత పెద్దగా మొగ్గు చూపడం లేదట. కాగా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి రాజీనామా చేసి వెళ్లి, ఇప్పటి వరకూ ఆరు నెలలు దాటుతుంది.. అయినా ఇంతవరకు ఆపదవిలో ఎవరినీ నియమించలేదు..
ఇదే సమయంలో తెలుగు యువత కార్యవర్గాన్ని నియమించడంలోనే చంద్రబాబు ఇంకా ఎంత టైమ్ తీసుకుంటారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.. ఇలాంటి టైం లో తెలుగు యువత అధ్యక్ష పదవిని జేసి దివాకర్ రెడ్డి తనయుడు జేసి పవన్ రెడ్డికి ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది.. దీనివెనక ఉన్న చంద్రబాబు ప్లాన్ ఏంటంటే.. రాయలసీమ ప్రాంతంలో పార్టీ చాలా వరకు డౌన్ అయిన నేపథ్యంలో, ఈ పదవిని జేసీ పవన్ రెడ్డి కి అప్పచెబితే, కనీసం ఆ ప్రాంతంలో అయినా టీడీపీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని, చంద్రబాబు భావిస్తున్నారట..
అందుకే ఈ పదవి కోసం అనేక మంది టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు తమ వారసులకు ఇప్పించడానికి చంద్రబాబుతో మంతనాలు జరిపినా, బాబుగారు మాత్రం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్.. ఇక వచ్చే దసరాకి జేసీ పవన్ రెడ్డి కి తెలుగు యువత అధ్యక్ష పదవిని చంద్రబాబు కట్టబెట్టడం గ్యారెంటీ అనే గుసగుసలు టీడీపీ పార్టీలో గట్టిగా వినపడుతోందట.. మొత్తానికి చెప్పవచ్చేది ఏంటంటే రెడ్డి గారికి టీడీపీ లో చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు.. ఇకపోతే టీడీపీ లోని తెలుగు యువత కు సారథ్యం వహించిన అనేక మంది నేతలు తర్వాతి కాలంలో ఎన్నో ఉన్నత పదవులు పొందారు…