Prabhas Marriage : మన టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ గా మిగిలి ఉన్న హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. అక్కడ బాలీవుడ్ కి సల్మాన్ ఎలా మిగిలిపోయాడో మన దగ్గర ప్రభాస్ మిగిలాడు. దీనితో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభాస్ పెళ్లి కోసం హాట్ టాపిక్ గా వినిపిస్తూ వస్తూనే వచ్చింది.
అయినా ప్రభాస్ బిజీ వల్ల ఇప్పటికీ ప్రభాస్ స్టేటస్ సింగిల్ గానే మిగిలిపోయింది. అయితే ప్రభాస్ ఇంట్లో మాత్రం పెళ్లి ప్రస్తావన వారి పెద్దలకి ఎప్పుడు అలా మెదులుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు దంపతులకి అయితే ప్రభాస్ పెళ్లి కోసం ఎప్పుడూ ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉంటాయి.
మరి లేటెస్ట్ గా అయితే కృష్ణం రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మళ్ళీ అదే ప్రశ్నలు ఎదురు కాగా ఆయన చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయని చెప్పాలి. ప్రభాస్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. తను పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటే నేను అంత త్వరగా చూడాలని కోరుకుంటున్నాను.
తనకి పుట్టిన బాబో పాప తోనో ఆదుకోవాలని నాకూ ఉంది అని భావోద్వేగ పూరిత స్టేట్మెంట్స్ చేసారు. ఇవి ఒకింత బాధాకరంగా కూడా ఉన్నాయని చెప్పాలి. మరి ప్రభాస్ ఎప్పుడు ఆ శుభ వార్త అందిస్తాడో కానీ తన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” లో అయితే కీలక పాత్రలో కృష్ణం రాజు నటించిన సంగతి తెలిసిందే.