రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకప్పటి సినీ హీరో ప్రస్తుత సినీ హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది.