జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమా ఫ్లాప్ కావడానికి ఐదు కారణాలు ఇవే?

జూనియర్ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన అశోక్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించగా ఈ సినిమా ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. సమీరా రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా సోనూసూద్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. అప్పట్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడి పాత్రలో ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి రెండో సినిమాకే ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందారు. సింహాద్రి తర్వాత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అశోక్ తో సక్సెస్ సాధిస్తారని అందరూ భావించారు. ఈ సినిమాకు తారక్ ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ హైలెట్ గా నిలిచాయి.

తొలి వారం 11 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తర్వాత వారం కలెక్షన్ల విషయంలో డ్రాప్ అయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడానికి ఐదు కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకునేలా లేదని కామెంట్లు వినిపించాయి. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఇతర సినిమాలలా సాధారణంగానే ఉండటం గమనార్హం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది.

అశోక్ విడుదలయ్యే సమయానికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో అశోక్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాలో హీరోయిన్ పర్ఫామెన్స్ ఆకట్టూకునేలా లేదని కామెంట్లు వినిపించాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. కొత్తరకం కథ, సరికొత్త క్లైమాక్స్ తో తెరకెక్కించి ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచి ఉండేది.