వడ్డే నవీన్ కెరీర్ లో సక్సెస్ కాకపోవడానికి కారణాలేంటో మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో వడ్డే నవీన్ ఒకరు అనే సంగతి తెలిసిందే. వడ్డే నవీన్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి వడ్డే నవీన్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. బ్యాగ్రౌండ్ ఉన్నా, నటుడిగా మంచి పేరు వచ్చినా సక్సెస్ కు దూరం కావడం వల్ల వడ్డే నవీన్ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.

అలీతో సరదాగా షోలో వడ్డే నవీన్ కనిపిస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వడ్డే నవీన్ మాత్రం టీవీ షోలలో కనిపించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకు కావడంతో వడ్డే నవీన్ కు సులభంగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాయి. పెళ్లి, చాలా బాగుంది సినిమాలు వడ్డే నవీన్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఈతరం ప్రేక్షకులలో చాలామందికి వడ్డే నవీన్ గురించి పెద్దగా తెలియదు. ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ ఎటాక్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కూడా ఎటాక్ కు కలిసిరాలేదు. కథ, దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్లే ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో నవీన్ సినిమాల్లో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

వడ్డే నవీన్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారని మరి కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం వడ్డే నవీన్ పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. తండ్రి మరణం వడ్డే నవీన్ ను మరింత బాధ పెట్టిందని సమాచారం. వడ్డే నవీన్ మీడియా ముందుకు వచ్చి తన గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.