టాలీవుడ్ హీరోలలో తక్కువ సినిమాలతోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరనే సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఉదయ్ కిరణ్ కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా ఆయన ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీ అనే సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి మాత్రం గతంలో ఉదయ్ కిరణ్ గురించి, ఉదయ్ ఆత్మహత్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఉదయ్ కిరణ్ భార్య విషిత వల్లే ఉదయ్ చనిపోయాడని ఆమె కామెంట్లు చేశారు. ఉదయ్ కిరణ్ ఎవరైనా కావాలని తనను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తే అస్సలు తట్టుకునేవాడు కాదని సమాచారం. చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ బంధానికి బ్రేక్ పడింది.
ఉదయ్ కిరణ్ ఒక జర్నలిస్త్ తో ప్రేమలో పడ్డారని ఆ ప్రేమ విఫలమైందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చిరంజీవి తమకు సాయం చేశారనే తప్ప చెడు చేయలేదని ఉదయ్ అక్క చెప్పుకొచ్చారు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడం, అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలకు వడ్డీతో సహా డబ్బు చెల్లించాల్సి రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని సమాచారం అందుతోంది. భార్య పట్టించుకోలేదనే భావన కూడా ఉదయ్ ఆత్మహత్యకు కారణమని సమాచారం.
ఉదయ్ కిరణ్ చనిపోయిన ముందు రోజు కూడా భార్య మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో ఉన్నారని బోగట్టా. కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదురైన సమయంలో భార్య నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఉదయ్ డిప్రెషన్ కు గురయ్యాడని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఉదయ్ కిరణ్ విషిత వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చాలామంది భావిస్తారు. ఉదయ్ మరణ వార్త అభిమానులను ఇప్పటికీ బాధ పెడుతోంది.
