Sreehari: శ్రీహరి గారు బాగా కష్టపడ్డారని, అప్పట్లో ఆయనకు లారీ బిజినెస్ ఉండేదని నటుడు మేక రామకృష్ణ తెలిపారు. అంతే కాకుండా ఆయనది చాలా ఫ్రెండ్లీ నెచర్ అని, అందరితో కలిసిపోతాడని, ఎవ్వరికీ భయపడరు అని, డేర్‌నెస్ ఎక్కువ అని ఆయన చెప్పారు. దానికి తోడు ఆయనకు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువేనని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఆయన చనిపోయే టైంకి వచ్చేసరికి పాన్ పరాక్ చాలా దెబ్బతీసిందని ఆయన చెప్పారు. ఆయన్ని ఎప్పుడైనా కలిసినపుడు బ్రదర్ అని అనేవారని, ఏంటయ్యా రామకృష్ణ కలవవేంటీ నువ్వు అని అనేవారని ఆయన తెలిపారు. దానికి తాను మీరు బిజీగా ఉంటారు కదా అని ఏదో చెప్పబోతుంటే, బిజీ నా తొక్క అని సరదాగా మాట్లాడే వారని రామకృష్ణ చెప్పారు. ఆయన్ను కలవడానికి వెళితే అక్కడ ఆయన పక్కన ఉండే వాళ్లు ఆపుతారు కదా, మళ్లీ తిరిగి వెళ్లాల్సి వస్తుందేమోనని, అలా కాకపోయినా డైరెక్ట్‌గా అప్రోచ్ కావచ్చు కానీ ఆయన అలసిపోయి వస్తారేమో, బిజీగా ఉంటారేమోనని తానే ఆగిపోయేవాడినని రామకృష్ణ చెప్పారు.
అంతేకాకుండా శ్రీహరి గారు ఆయన పుట్టిన రోజు గానీ, లేదా ఆయన్ని కలవడానికి గానీ ఎవరైనా ఫ్యాన్స్ వస్తే ఆయన్నే దగ్గరికి వచ్చి కలిసేవారని ఆయన చెప్పారు. లంచ్ టైం లేదా టీ టైంలో ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా పెట్టే పంపిస్తారని రామకృష్ణ తెలిపారు. అంతే కాదు బయట ఎక్కడైనా కనిపించినా కూడా వచ్చి భుజం మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతారని ఆయన చెప్పారు. కృష్ణంరాజు హీరో చేసిన ప్రచండ భారతం అనే సినిమాలో హీరోకి ఫ్రెండ్స్‌గా తాము కలిసి నటించామని ఆయన తెలిపారు.