స్టార్ హీరో అబ్బాస్ పెట్రోల్ బంక్ లో పని చేయడానికి అసలు కారణాలు ఇవే?

టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన అబ్బాస్ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఇవ్వనున్నాడని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అబ్బాస్ కొన్నేళ్ల క్రితం పెట్రోల్ బంక్ లో కూడా పని చేశారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అబ్బాస్ కొన్ని కారణాల వల్ల పెట్రోల్ బంక్ లో పని చేశారు. ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారనే సంగతి తెలిసిందే. ప్రేమదేశం తర్వాత అబ్బాస్ పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులు ఆయన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. కథల ఎంపికలో చేసిన పొరపాట్లు అబ్బాస్ కెరీర్ పై ప్రభావం చూపాయి.

రెహమాన్ ఈ సినిమాకు ఇచ్చిన పాటలు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. కొన్ని సినిమాలలో సెకండ్ హీరో పాత్రలలో నటించడం కూడా అబ్బాస్ కెరీర్ కు మైనస్ అయింది. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఛాన్స్ వచ్చినా డేట్లు కేటాయించలేక అబ్బాస్ సినిమాలను వదులుకున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకే విధంగా యాక్ట్ చేయడంతో అబ్బాస్ కు ప్రేక్షకాదరణ అంతకంతకూ తగ్గింది.

ఆ తర్వాత రోజుల్లో అబ్బాస్ టీవీ సీరియల్స్ లో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత న్యూజిలాండ్ కు వెళ్లిపోయిన అబ్బాస్ కొన్నిరోజుల పాటు పెట్రోల్ బంక్ లో పని చేశారు. పెట్రోల్ బంక్ లో పని చేయడం తనకు ఇష్టం కావడంతో అబ్బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు పనులు చేసిన అబ్బాస్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసున్నారు.