చిరంజీవిని జూనియర్ ఎన్టీఆర్ అలా కామెంట్లు చేసి అవమానించారా.. ఏం జరిగిందంటే?

చాలా సంవత్సరాల క్రితం చిరంజీవిని జూనియర్ ఎన్టీఆర్ అవమానించే విధంగా మాట్లాడారని ఇండస్ట్రీలో ఒక రూమర్ ప్రచారంలో ఉంది. మెగా, నందమూరి అభిమానులలో చాలామంది ఆ రూమర్ ను నిజమేనని నమ్ముతారు. స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడంతో పాటు వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు. అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి ఎవరో తెలియదని అన్నారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఒక ఉద్యోగి సంచలనాన్ని సృష్టించడం కోసం చేసిన ఆ కామెంట్ ను అప్పటి ప్రముఖ వెబ్ సైట్ ప్రచురించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊహించని స్థాయిలో ఆ వార్త గురించి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ ఆ వార్త గురించి స్పందించకపోవడంతో ఆ సమయంలో నిజానిజాలు ఎవరికీ తెలియలేదు. అయితే మెగా, నందమూరి కుటుంబాల సన్నిహితులకు మాత్రం వాస్తవం ఏమిటో తెలుసని సమాచారం.

వాస్తవం ఏమిటంటే పెద్దలంటే ఎంతో గౌరవించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు. చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో ఒకే వేదికపై ఒకరి గురించి మరొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి చేతుల మీదుగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డును అందుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. సింహాద్రి తర్వాత తారక్ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

అయితే యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడంతో పాటు ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. తర్వాత సినిమాలతో కూడా ఎన్టీఆర్ కు సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఅర్ సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మినిమం గ్యారంటీ హీరో అని చాలామంది ఫ్యాన్స్ భావిస్తారు.