RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పూర్తిస్థాయిలో అభిమానులను నిరాశపరిచిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో చరణ్ దృష్టి సారించారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ , స్పోర్ట్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలో ఉన్నాయి ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా సెరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమా సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనులలో ఉన్నారు అదేవిధంగా మరోవైపు సినిమాలో నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల తో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటారా సుకుమార్ అడిగితే ఆమె నో చెప్పే అవకాశాలే లేవు. అయితే చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంతను ఇలా పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో కూడా డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అలాగే పలు వెబ్ సిరీస్ ల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సమంతకు మంచి క్రేజీ ఉంది ఈ సినిమాలో కనుక సమంతను తీసుకుంటే మరో ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ అని చెప్పాలి. ఇదివరకు సమంత చరణ్ కాంబోలో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిట్టిబాబు రామలక్ష్మి పాత్రలో వీరిద్దరూ ఒదిగిపోయి నటించారు. మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతోంది అంటే అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.