ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి. హీరోలు చాలామంది ఒకరి తర్వాత ఒకరు చిత్రీకరణలు నిలిపివేస్తున్నారు. దర్శకులు కూడ కరోనాకు గురవుతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడికి వైరస్ సోకగా ఇప్పుడు ఇంకొక దర్శకుడు కూడ కరోనాకు గురైనట్టు తెలుస్తోంది. అతనే రమేష్ వర్మ. ప్రస్తుతం ఈయన రవితేజతో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా చేస్తూ వచ్చారు. కానీ ఇంతలోనే ఆయనకు వైరస్ లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందట.
దీంతో రవితేజ వెంటనే షూటింగ్ ఆపేసి ప్యాకప్ చెప్పేశారట. కల్సి పనిచేసిన అందరూ పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికైనా పాజిటివ్ వస్తే పూర్తిగా తగ్గిన తర్వాతనే సెట్లోకి అడుగుపెట్టాలని తేల్చి చెప్పారట. పైగా షూటింగ్ కూడ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాతనే రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఇక రవితేజ కొత్తగా సైన్ చేసిన సినిమాలు కూడ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేవు. అవి కూడ పరిస్థితులు చక్కబడ్డాకనే మొదలవుతాయట. అందరు హీరోలు గాబరాపడుతున్నా రవితేజ మాత్రం తొందరేం లేదు.. అంతా సర్దుకున్నాకనే చేసుకుందాం అంటున్నారట.