Raviteja: జనవరి 26న తన అరడజను సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వనున్న మాస్ మహారాజా..?

Raviteja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవితేజ, కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండి క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా వరుస సినిమాలు చేయడం మానేసి ఏడాదికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం మళ్లీ తన జోరు ని పెంచేశారు రవితేజ. ఇకపోతే ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇకపోతే రవితేజ అభిమానులకు ఒక చక్కటి శుభవార్త.. అదేమిటంటే జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా తన ఆరు సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయనున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ అరడజను సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో దాదాపుగా నాలుగు సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తయింది. వరుసగా సినిమాలు చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ, అన్ని సినిమాలను పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తున్నారు రవితేజ. ఇక జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి రవితేజ సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేయనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఆ తరువాత రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు.

దాంతో పాటుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే షూటింగ్ దశలో ఉన్న సుధీర్ వర్మ రావణాసుర సినిమా నుంచి పోస్టర్ కూడా విడుదల కానుంది. అదేవిధంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి మేనేజర్ అప్డేట్ ను కూడా విడుదల చేయనున్నారు దర్శకుడు వంశీ. అంతేకాకుండా 2022 లో రవితేజ నటించిన మూడు సినిమాలు విడుదల కావడం ఖాయం.