చిరంజీవి సినిమాలో రవితేజ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి వరుస సినిమాలలో నటిస్తున్నాడు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.

డైరక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రవితేజని సంప్రదించారు. అయితే రవితేజ కూడ ఈ సినిమాలో నటించటానికి అంగీకరించించాడు. కాకపోతే వరుస సినిమాతో రవితేజ డేట్స్ కుదరకపోవటంతో ఈ సినిమా నుండి తప్పుకోవల్సి వచ్చింది. క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు మరొక సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కి బదులుగా మరొక యంగ్ హీరో ని సంప్రదించారు. అయితే మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? ఈ యంగ్ హీరో కూడా వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఆ యంగ్ హీరో ఎవరో కాదు శర్వానంద్.

మెగాస్టార్ కుటుంబంతో శర్వానంద్ కి ఉత్తి పరిచయం మాత్రమే కాకుండా బంధుత్వం కూడా ఉంది. అందువల్ల ఈ సినిమా కోసం శర్వానంద్ ని సంప్రదించగా… శర్వానంద్ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తోంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ సినిమాలతో అలరించనున్నాడు. అయితే వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూడాలి మరి.