టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈయన పారితోషకం విషయంలో చాలా డిమాండ్ చేస్తున్నాడు అని.. నిర్మాతలను వేధిస్తున్నాడు అని తెగ జోరు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా రామారావు ఆన్ డ్యూటీ సినిమా సమయంలో సీన్లను రీ షూట్ చేశారు అని.. వాటికి కూడా అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రచారం జరగడంతో.. ఈ విషయం గురించి రవితేజ స్పందించాడు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు తను కో ప్రొడ్యూసర్ అంటూ..
అలాంటప్పుడు పారితోషకం సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించాడు. అంతేకాకుండా నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు.. వారిచ్చిన చెక్కులను తను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. వెబ్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చాడు.