నవ్య స్వామిని వదిలి గోరింటాకు హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న రవి కృష్ణ!

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి కృష్ణ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈయన తన సహ నటి నవ్య స్వామితో కలిసి ఈ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరు కలిసి నటిస్తున్న సీరియల్లో వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రేమ లేదని ఈ జంట ఖండించారు.

ఢీ కార్యక్రమంలో భాగంగా నవ్య స్వామి రవికృష్ణ చేసే కామెడీ స్కిట్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది.అయితే తాజాగా రవి కృష్ణ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నవ్య స్వామి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో రవికృష్ణ ఏకంగా గోరింటాకు హీరోయిన్ కావ్యతో రొమాన్స్ చేశారు. కావ్య గోరింటాకు సీరియల్ హీరోతో ప్రేమలో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రవికృష్ణ కావ్య ఇద్దరూ కూడా వారి సహనటులను వదిలిపెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో వీరిద్దరూ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.

ఈ క్రమంలోనే చీరకట్టులో ఉన్నటువంటి కావ్య నటుడు రవి కృష్ణతో కలిసి చేసిన రొమాంటిక్ స్టెప్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎంతో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వేదికపై వీరు చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో రవి కృష్ణ సందడి చేసినప్పటికీ నవ్య స్వామి కనిపించకపోవడంతో ఈమె ఈ కార్యక్రమంలో సందడి చేయకపోవడానికి కారణం ఏంటి అంటూ పలువురు ఆరా తీస్తున్నారు.