బుల్లితెర మీద సందడి చేస్తున్న మేల్ యాంకర్స్ లో రవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా బాగా పాపులర్ అయిన రవి బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలకుగా వ్యవహరించాడు. యాంకర్ గా బిజీగా ఉండే రవి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటాడు. రవి సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. యాంకర్ గా రవికి ఉన్న పాపులారిటీ వల్ల బిగ్ బాస్ లో కూడా పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు.
బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న రవి అక్కడ తన పర్ఫార్మెన్స్ వల్ల ప్రేక్షకుల నుండీ నెగటివ్ కామెంట్స్ ఎదుర్కోవల్సి వచ్చింది. బిగ్ బాస్ వల్ల రవి మొత్తానికి నెగిటివిటి మూట కట్టుకొని బయటికి వచ్చాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రవి బుల్లితెర మీద ప్రసారమైన పలు టీవి షో లకు యాంకర్ గా వ్యవహరించాడు. అంతే కాకుండా మొన్నటి వరకు బిగ్ బాస్ ఓటీటీ బజ్ ద్వారా అందరినీ దగ్గరయ్యాడు. బజ్ ఇంటర్వ్యూలు బాగానే ఫేమస్ అయ్యాయి. అయితే బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసే సమయంలో రవి అడిగిన ప్రశ్నలు చాలా వైరల్ అయ్యాయి.
ఇటీవల రవి సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న ప్రస్తుతము చర్చంశనీయంగ మారింది. తాజాగా రవి నిర్వహించిన చిట్ చాట్ లో భాగంగా ” నువ్ యాంకర్‌గా బిగ్ బాస్ ఓటీటీ బజ్‌లో పక్షపాతంగా వ్యవహరించావని నేను అంటాను.. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దానికి స్పందించిన రవి.. అందరినీ అన్ని విధాలుగా మనం శాటిస్‌ఫై చేయలేం.. అది నా పని . మీకు అలా అనిపించి ఉంటే నేనేం చేయలేను.. అయినా మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను.. కానీ నేను చేసిన పని పట్ల మా టీం, చానెల్, బిగ్ బాస్ టీం అంతా కూడా సంతృప్తికరంగానే ఉంది. నాకు అది చాలు అంటూ చాలా సున్నితంగా సమధానం ఇచ్చాడు.