NTR: సినీ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసుడుగా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరికి ఎంతో మంచి అభిమానం ఉందని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఒక డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ హైట్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్ చాలా పొట్టిగా ఉంటారు అంటూ ఈయన మాట్లాడినటువంటి ఒక వీడియోని కట్ చేసి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఎన్టీఆర్ హైట్ గురించి మాట్లాడిన ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవిబాబు ఒకరు. తాజాగా రవిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆయనకు అసలు తెలుగు రాదు ఎక్కడి నుంచో రావాలి… నా భుజం వరకే హైట్ ఉంటాడు అంటూ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియోని కట్ చేస్తూ ఆ వీడియోకి ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలోని రవిబాబు ఎన్టీఆర్ సన్నివేశాలను జోడించారు.
ఇక ఈ వీడియోని ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పరోక్షంగా ఎన్టీఆర్ హైట్ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇది ఎడిటెడ్ వీడియో అని రవిబాబు ఎన్టీఆర్ గురించి అలా మాట్లాడే ప్రసక్తి లేదని తెలుపుతున్నారు. ఎందుకంటే రవిబాబు తండ్రి నటుడు చలపతిరావు అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం తనని బాబాయి బాబాయి అంటూ పిలుస్తూ ఉండేవారు. అలాంటి మంచి అనుబంధమున్న ఎన్టీఆర్ గురించి రవిబాబు ఇలా మాట్లాడి ఉండరు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.