Ravi Babu: రవిబాబు నన్ను పర్సనాలిటీ ఉంటే సరిపోదు.. అంటూ అవమానించారు.. కమెడియన్?

Ravi Babu: డైరక్టర్ రవిబాబుతో కలిసి పని చేస్తున్నపుడు షూటింగ్‌లో ఒకసారి తనపై గట్టిగా అరిచారని కోటేశ్వర రావు తెలిపారు. ఆయన చాలా సీరియస్. కానీ ఆ సీన్ అయిపోయాక బయటికి వస్తే మాత్రం చాలా సరదాగా ఉంటారని ఆయన అన్నారు. అది మనసారి సినిమాకు సంబంధించి ఓ సీన్ షూట్ చేసేటపుడు జరిగిందని, హీరోయిన్‌కి, కెమెరాకు తాను కొంచెం దూరాన్ని మెయిన్‌టైన్ చేయాలి. మళ్లీ డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ ఒక పేజీ ఉందని, అది ఒక రోజు ఇచ్చారని ఆయన తెలిపారు. నిలబడి అయితే చెప్పేయొచ్చు. కానీ డైలాగ్ చెప్పేటపుడు కొంచెం మిస్టేక్ అయిందని కోటేశ్వర రావు చెప్పారు. అప్పుడు రవిబాబు తనపై అరిచారని ఆయన వివరించారు. ఆయన తిట్టడం కూడా చాలా వెరైటీగా ఉంటున్న కోటేశ్వర రావు, మీరు పర్సనాలిటీ ఎస్వీ రంగారావులా ఉంటే సరిపోదండీ, ఆయనలా యాక్ట్ చేయాలి అని అన్నారని ఆయన అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండలా బాలకృష్ణ గురించి ఏవేవో మాట్లాడుకుంటారు గానీ, ఆయనకు గనక నచ్చితే మనమేం అడిగినా ఆయన ఇచ్చేస్తారని కోటేశ్వర రావు అన్నారు. సెట్లో కూడా అందరితోనూ బాలకృష్ణ చాలా సరదాగా ఉంటారని, ఇప్పుడు ఆహా టాక్‌ షోలో ఎలా ఉంటారో, బయట కూడా ఆయన అలానే ఉంటారని ఆయన చెప్పారు. అందరూ యాక్టింగేమో అది అనుకుంటారు గానీ, ఆయన మామూలుగానే అలానే ఉంటారని కోటేశ్వర రావు స్పష్టం చేశారు.

ఇకపోతే తన బేస్ వాయిస్‌ను వేరేవారికి ఉపయోగించలేదని, తనకు తప్ప మరెవరికీ తాను డబ్బింగ్ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. కాని కొన్ని ఆబ్లికేషన్స్ వల్ల సముద్ర గారి సినిమాల్లో, పూరి గారి సినిమాల్లో ఒక సందర్భంలో వేరే ఆర్టిస్ట్‌కి తన యాక్టింగ్‌తో పాటు, వేరే అతనికి కూడా తాను డబ్బింగ్ చెప్పానని ఆయన తెలిపారు. ఇంటింటి రామాణయం అనే సినిమా కన్నడ నుంచి డబ్ చేశారని, ఆ సినిమాలో ఓ ఇన్స్‌పెక్టర్‌కి ప్రకాష్ రాజ్ పిలిపించి మరీ డబ్బింగ్ చెప్పించారని ఆయన వివరించారు. అంతే కాని తాను ఫ్రొపెషనల్‌గా ఎవరికీ డబ్బింగ్ చెప్పలేదని ఆయన అన్నారు. తన యాక్టింగ్‌కి కూడా 2009కి ముందు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పేవారని, ఆ తర్వాత నుంచి తానే చెప్పుకున్నానని ఆయన వెల్లడించారు.