Raveena Tandon: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవీనాటాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతంలో తను నటించిన ఎంతోమంది సహ నటులతో తనకు ఎఫైర్స్ ఉన్నాయని వారితో నేను రిలేషన్ లో ఉన్నాననే విషయాన్ని పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించారని ఈ సందర్భంగా రవీనాటాండన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సాధారణంగా నేను నటించిన సినిమాలు ప్రతి ఒక్కరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని అయితే ఇదే విషయాన్ని ఎంతోమంది వేరే ఉద్దేశంతో వారితో నేను చనువుగా ఉంటున్నానని వారితో నాకు అఫైర్స్ ఉన్నాయని వార్తలను సృష్టించారని తెలిపారు. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే స్వయంగా నా సొంత సోదరుడు తోనే నాకు లింకు కూడా పెట్టారని ఈ ఇంటర్వ్యూలో ఈమె బాధపడ్డారు.ప్రతి రోజు షూటింగుకు నన్ను డ్రాప్ చేసే పికప్ చేసుకోవడానికి వచ్చిన నా సోదరుడితో నాకు ఆ ఫైర్ అంటగట్టారు.
ఈ క్రమంలోనే తనని చూసిన ఎంతోమంది మీడియా మేము రవీనాటాండన్ బాయ్ ఫ్రెండ్ ని కనుగొన్నాము అంటూ తన సోదరుడితో తనకు ఈ విధమైనటువంటి లింక్ పెట్టారని ఈ విషయం తెలిసి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానోనని ఈ సందర్భంగా రవీనాటాండన్ తన బాధను తాను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టారు. ఈ మేరకు కొందరు జర్నలిస్టుల వ్యవహార శైలిని తప్పుబడుతూ మనం వారికి హలో చెప్పిన అందులో ఒక తప్పును వెతుకుతారని ఈమె మీడియాకు చురకలు అంటించారు. ఇక సినిమాల విషయానికోస్తే..రవీనా ప్రస్తుతం ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్2’లో నటిస్తుండగా.. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.