Rashmika: విజయ్ నుంచి అన్ని కావాలి… మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక… ఇకనైనా బయటపడండి అంటూ?

Rashmika: సినీ నటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి వెకేషన్ లకి వెళ్లడం ఒకే చోట ఫోటోలు దిగి విడివిడిగా షేర్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెప్పేస్తున్నారు . ఇలా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన ఇప్పటివరకు వీరు మాత్రం ఈ వార్తలపై అధికారకంగా ఎక్కడ స్పందించలేదు.

తాజాగా రష్మిక మరోసారి విజయ్ దేవరకొండతో ప్రేమ గురించి చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఈమె కుబేర సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారస్మిక వద్దకు వెళ్లి ఈ హీరోలలో మీరు ఏదైనా క్వాలిటీస్ కాపీ చేయాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ కాపీ చేస్తారు అంటూ ప్రశ్నించారు. ముందుగా నాగార్జున పేరు చెప్పగానే ఆయన ఆకర్షించే గుణం అలాగే ఆరా కాపీ చేస్తానని తెలిపారు.bఇక్కడ ధనుష్ పేరు చెప్పగానే ధనుష్ గారు చాలా మల్టీ టాలెంటెడ్ అని ఆయన దర్శకుడిగా నటుడిగా సింగర్ గా నిర్మాతగా అన్ని చేస్తారని ఆ క్వాలిటీస్ అన్ని కావాలని కోరుకుంటానని తెలిపారు.

ఇకపోతే అల్లు అర్జున్ నుంచి ఏ క్వాలిటీస్ కాపీ చేస్తారనే ప్రశ్న ఎదురవడంతో ఆయన స్వాగ్ కాపీ చేస్తానని రష్మిక తెలిపారు. ఇక చివరిగా విజయ్ దేవరకొండ పేరు చెప్పడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం కేరింతలతో మారు మోగిపోయింది. ఇక విజయ్ పేరు వినగానే రష్మిక కూడా తెగ సిగ్గుపడుతూ అతని నుంచి అన్ని కాపీ చేస్తానని ప్రతి ఒక్కటి తీసేసుకుంటాను అంటూ రష్మిక చెప్పటం విశేషం. ఇలా విజయ్ దేవరకొండతో గురించి చెప్పడంతో వీరిద్దరూ పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారని, అందుకే విజయ్ దేవరకొండ గురించి అలా రియాక్ట్ అయ్యారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.