Vijay-Rashmika: విజయ్ దేవరకొండకు కొత్త పేరు పెట్టిన రష్మిక.. నిన్ను గర్వపడేలా చేస్తా అంటూ!

Vijay-Rashika: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వినిపించినప్పటికీ ఈ వార్తలపై రష్మిక, విజయ్ లు స్పందించలేదు. అయితే వీరు ఈ వార్తలపై స్పందిచక పోయిన కూడా వారి ప్రవర్తన కలిసి ట్రిప్ లకు వెళ్లడం ఇవ్వన్ని చూస్తుంటే నిజమని నమ్మక అనిపించదు. అవును మేం ప్రేమలోనే ఉన్నాం అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్‌ అయితే ఇస్తున్నారు.

కలిసి ట్రిప్స్‌కి వెళ్తున్నారు.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్‌ లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే పరోక్షంగా తాము రిలేషన్‌ లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్‌ ఉన్న ఫోటోలను దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడుతూ తమ లవ్‌ మ్యాటర్‌ ని కొంచెం కొంచెం రివీల్ చేస్తున్నారు. వీటిని చూస్తే వీరి మద్య ఏదో ఉంది అని అనిపిస్తు ఉంటుంది. తాజాగా రష్మిక విజయ్‌ కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.

ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్‌ పాత్ర పోషిస్తోందీ. తొలిసారి ఆమె వారియర్‌ గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్‌ లుక్‌ లో కనిపించి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్‌ లుక్‌ పై ప్రశంసలు కురిస్తూ రష్మికకి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. అలా విజయ్‌ దేవరకొండ కూడా మైసా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది అని రాసుకొచ్చాడు. అయితే విజయ్‌ పోస్ట్‌ పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్‌ తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.