Rashmika: హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుంటా…. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన రష్మిక?

Raahmika: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్న నేపథ్యంలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరో బాలీవుడ్ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న రష్మిక మరో సినిమా ద్వారా రాబోతున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక శంబాజీ భార్య ఏసు భాయి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి రష్మిక మందన్న పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

ఈ సినిమాలో తాను ఏసు భాయి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు. నా సినీ కెరియర్ లో ఇంత అద్భుతమైన పాత్రలో నటించడానికి చాలా గర్వకారణంగా అనిపిస్తుందని తెలిపారు. ఈ పాత్రలో నటిస్తున్న సమయంలో చాలా సార్లు ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఇక దర్శకుడితో తాను పలు సందర్భాలలో మాట్లాడుతూ ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. నేను ఇప్పుడే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించమన్నా చాలా హ్యాపీగా ప్రకటిస్తానని డైరెక్టర్ వద్ద పలు సందర్భాలలో చెప్పాను అంటూ రష్మిక ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.