Rashmika: ఎంతో క్యూట్ గా ముద్దు పేరుతో విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక… పోస్ట్ వైరల్!

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రెండు సినిమాలలో కలిసి నటించారు. ఇలా వీరిద్దరూ రెండు సినిమాలలో నటించడంతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఈ జంట ఎప్పుడు ఖండించకపోగా తరచూ జంటగా వెకేషన్ లకు వెళ్లడంతో వీరి ప్రేమ గురించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ వచ్చాయి.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నా ఎక్కడ కూడా వీరు ఆ వార్తలను ఖండించలేదు అయితే తాజాగా రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఇతర సెలబ్రిటీలు విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక రష్మిక మాత్రం నిన్న సాయంత్రం వరకు ఎక్కడా కూడా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు అయితే నిన్న సాయంత్రం ఈమె సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఎంతో క్యూట్ గా విజయ్ దేవరకొండను ముద్దు పేరు పెట్టి పిలుస్తూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండ ఫోటోని షేర్ చేస్తూ అందరికంటే కూడా నేను చాలా ఆలస్యంగా విష్ చేస్తున్నాననే విషయం నాకు తెలుసు.కానీ హ్యాపీ బర్త్ డే విజ్జు.. నువ్వు ప్రతిరోజు సంతోషంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ, ప్రశాంతంగా ఉండాలని, నువ్వు కోరుకున్న ప్రతీది అందుకోవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. విజయ్ ను రష్మిక ముద్దుగా విజ్జు అని పిలుస్తుందా అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి వీరి డేటింగ్ రూమర్లను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.