ర‌ష్మిక మందాన సెటైరిక‌ల్ కామెంట్‌.. అంద‌రు షాక్!

ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మందాన‌. క్యూట్‌క్యూట్‌గా, చ‌బ్చీ చ‌బ్బీగా ఉండే ర‌ష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారింది. రీసెంట్‌గా సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాతో బిజీగా ఉంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో ర‌ష్మిక పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. సుకుమార్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

రోజురోజుకు ర‌ష్మిక డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఈ అమ్మ‌డికి తెలుగులోనే కాదు త‌మిళం, హిందీ చిత్రాల‌కు సంబంధించి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ‘మిషన్‌ మజ్ను’ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేయబోతున్న ఈ కన్న‌డ సోయ‌గం రెమ్యున‌రేష‌న్ బాగా పెంచింద‌నే టాక్ న‌డుస్తుంది. ఒక్క సినిమాకు ఆమె రెండుకోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటోందని కథనాలు రాగా, దీననిపై సొగసరి స్పందిస్తూ ‘అందరు అనుకుంటున్నట్లుగా అంతమొత్తం పారితోషికం తీసుకోవాలన్నది నా కల.
అది నిజమైతే బాగుండేది. సాధారణంగా నేను సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎక్కువగా మాట్లాడను అని పేర్కొంది ర‌ష్మిక‌.

పారితోషికం గురించి చెబితే ఇత‌ర క‌థానాయిక‌ల‌తో కంపేర్ చేసి చూస్తారు, ఇది నాకు న‌చ్చ‌ని ప‌ని. ఏ భాష‌లో న‌టిస్తున్నాం అన్న‌ది ముఖ్యం కాదు. దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్కించుకోవాల‌న్న‌దే నా క‌ల‌. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నాకు సొంత ఇల్లు కాగా, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ పాఠ‌శాల వంటింది. ఇక్కడ న‌ట‌న‌కు సంబంధించి అనేక వ‌విష‌యాలు నేర్చుకున్నా అని పేర్కొంది ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు శ‌ర్వానంద్ న‌టిస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోను న‌టిస్తుంది.