Rashmika Mandana: తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తున్న రష్మిక.. ఎందుకో తెలుసా?

Rashmika Mandana: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల అయ్యి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో రష్మిక మందన అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాకుండా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో రష్మిక మందన నటనకుగాను పలువురు నుంచి ప్రశంసలు కూడా అందాయి.

ఈ సినిమాలో రష్మిక మందన కు మేకప్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పుష్ప సినిమా విడుదల అయ్యి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేరళ, తమిళనాడులో పుష్ప సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రష్మిక మందన ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలి అన్న రష్మిక కళలను పుష్పా సినిమా విజయం మరింత పెంచిందని రష్మిక భావిస్తోంది. ఇక బాలీవుడ్ లో రష్మిక మందన నటిస్తున్న గుడ్ బాయ్, మిషన్ మజ్ను లాంటి సినిమాల కెరీర్ కు మరింత ఊపునిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో వస్తున్న ఆఫర్లను కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తెలుగులో స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా కూడా రష్మిక మందన తిరస్కరించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన దృష్టి అంతా ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఉంది. పాన్ ఇండియా సినిమా అయినా నో చెప్పేస్తోంది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తోంది అనేందుకు వారిద్దరూ కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం, గోవా టూర్ లో ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా వారి పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది అయినా రష్మిక మందన, విజయ్ దేవరకొండ ల నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది అని ఈ ఇద్దరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.