Rashmika: పొట్టి డ్రెస్సులో రారా సామి అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రష్మిక!

Rashmika: ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎవరి నోట వెంట అయినా వినిపిస్తున్న పాటలు ఏవైనా ఉన్నాయా అంటే అది పుష్ప సినిమాలో పాటలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటి వెంట ఈ సినిమాలో పాటలు వినబడుతూ ఉన్నాయి.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరోహీరోయిన్లుగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాటను రచయిత చంద్రబోస్ ఎంతో అర్థవంతంగా రాశారు. ఈ క్రమంలోనే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరింత హైలైట్ గా నిలిచింది. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీవల్లి పాత్రలో ఉన్నటువంటి రష్మిక రారా స్వామి అనే పాటలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి నిక్కరు ధరించి రారా స్వామి అంటూ అద్భుతమైన స్టెప్పులతో ఉన్నటువంటి ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది ఆకట్టుకుంటుంది.

పొట్టి డ్రెస్సులో రష్మిక స్టెప్పులకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటలకే మిలియన్ సంఖ్యలో వ్యూస్ రావడంతో ఈ సినిమాలో ఈ పాటకు రష్మిక స్టెప్పులకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడగా..ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.