Rashmika- Vijay Devarakonda: ముంబై వీధులలో చక్కర్లు కొడుతున్న రష్మిక విజయ్ దేవరకొండ.. ఫోటోలు వైరల్!

Rashmika- Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో గీతగోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు వీరిద్దరి మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెద్ద ఎత్తున పొగిడారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు విజయవంతం కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.

ఈ క్రమంలోనే ఈ జంట పలుసార్లు డిన్నర్, డేట్ అంటూ మీడియా కంట పడింది. తాజాగా వీరిద్దరూ కలిసి బాంద్రాలోని రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి డిన్నర్‌ డేట్‌ ముగించుకుని వెళ్తుండగా మరోసారి మీడియా కంట పడ్డారు.ఈ క్రమంలోనే ముందుగా హోటల్ నుంచి విజయ్ దేవరకొండ బయటకు వచ్చి తన కారులో వెళ్లగా అనంతరం వెనకే రష్మిక రావడంతో మీడియా వీరిపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.

ఇలా తరచూ వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే తాజాగా రష్మిక నటించిన సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా లైగర్ సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.