ఆ హీరో తో ఎఫైర్ గురించి ఒప్పుకున్న రష్మిక

నిన్నటి మొన్నటి వరకు రకుల్ ప్రీత్, సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగారు. ఇప్పుడు పూజ హెగ్డే, రష్మిక మందన్న టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్స్. ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో సాగిపోతున్నారు ఇద్దరు. అయితే పూజ హెగ్డే అఫైర్స్ గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు కానీ రష్మిక మీద చాలా గోషిప్స్ వచ్చాయి.

తన మొదటి సినిమా తర్వాత కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకొన్నాళ్ళల్లో పెళ్లి అవుతుంది అనుకునే టైం లో రష్మిక బ్రేక్ అప్ చెప్పేసింది. ఆ తర్వాత తెలుగు లో సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే ‘గీత గోవిందం’ సినిమా టైం లో విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.

ఇద్దరు తరచూ కలిసి హాలిడేస్ కి వెళ్లడం కూడా జరిగింది, కానీ దీని పై ఇద్దరూ స్పందించలేదు. చాలా సందర్భాల్లో  తాము కేవలం మంచి ఫ్రెండ్స్  మాత్రమే అని చెప్పిన  రష్మిక రీసెంట్  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. గతంలో రిషబ్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక తరువాత అతనితో బ్రేకప్ చేసుకుంది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ తనకి ఒక అండగా నిలబడ్డాడని చెప్పింది రష్మిక.

“నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా విజయ్ దేవరకొండ ఇన్ సెక్యూర్ కాదు. తన ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉంటాడు,” అని షాకింగ్ కామెంట్లు కూడా చేసింది.