Rashmi Gautam: ఆ ఫోటోలను సేవ్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మి..!

Rashmi Gautam: ఇండస్ట్రీలో బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ బాగా పాపులర్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన రష్మి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే బుల్లితెర ద్వార చాలా ఫేమస్ అయ్యింది.

యాంకర్ గా మాత్రమే కాకుండ సుధీర్ లవర్ గా కూడ చాల పాపులర్ అయ్యింది. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. మొదట్లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి.కానీ అవి కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అని తేలిపోయింది. కానీ వీరిద్దరు నిజ జీవితంలో కూడా కలసివుంటే చాలా బాగుంటుందని వీరి అభిమానులు ఆశ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మి తన అందమైన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇటీవల రష్మి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆ ఫోటోలో వెనుక ఉన్నరహస్యం గురించి చెప్పుకొచ్చింది. సుధీర్ రష్మీ అభిమానులు వారి పేరిట సోషల్ మీడియాలో ఎన్నో అకౌంట్లను మెయింటైన్ చేస్తుంటారు. సుధీర్ , రష్మి ఫ్యాన్ పేజీలు బాగానే వైరల్ అవుతుంటాయి. రష్మి సోషల్ మీడియా ఫేజ్ లో ఆమె అభిమానులు జబర్దస్త్ షో లోని ఆమె ఫొటోలు, వీడియోలను అందంగా ఎడిట్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. రష్మి తన ఫ్యాన్ పేజ్ చూసి అందులో తన ఫోటోలు ఎంతో అందంగా ఎడిట్ చేసి ఉండటంతో తనకు బాగా నచ్చాయి. అందువల్ల వానిటి సేవ్ చేసుకుంది. అలా సేవ్ చేసుకున్న ఫోటోలలో ఇటీవల కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.