Rashmi Gautam: పెళ్లిపీటలు ఎక్కనున్న రష్మి… ఎప్పుడో తెలుసా…?

Rashmi Gautam: ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమా ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల ద్వారా తగిన గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి యాంకరింగ్ చేసే అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. రష్మి నటిగా కన్నా యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తోంది. అంతే కాకుండా రష్మి మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ.. నటిగా తన సత్తా నిరూపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మీ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకే ఎన్నోసార్లు రష్మీ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. జబర్దస్త్ ద్వారా రష్మీ , సుధీర్ ల మధ్య ఉన్న లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమైన అనేక కార్యక్రమాలలో కూడా వీరిద్దరికీ పెళ్ళి కూడా చేశారు. స్టేజి మీద వీరిద్దరి మద్య ఉన్న కెమిస్ట్రీ వల్ల ఆడియన్స్ అందరు నిజంగానే వీరిద్దరూ ఫ్యూచర్ లో పెళ్ళి చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ సుధీర్ ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ లో కనిపించటం లేదు. సుధీర్ దూరమవడం వల్ల రష్మి కూడా చాలా బాధ పడింది.

ప్రస్తుతం రష్మి పెళ్లి గురించి వార్తల గురించి చాలా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రష్మి పెళ్లి జరిగినట్టు చాలా సార్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల గురించీ ఇప్పటివరకు రష్మి స్పందించకపోవడంతో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం రష్మి వచ్చే 2023 సంవత్సరంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే రష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించీ కూడా ఇప్పటివరకు ఎలాంటి సమచారం లేదు. దీంతో రష్మి సుధీర్ ని పెళ్లి చేసుకుంటుందా? లేక ఇతర వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పెళ్లి వార్త మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.