Raashi Khanna: అమ్మ రాశి ఖన్నా… డేటింగ్ కి వెళ్ళి ఛాన్స్ కొట్టేశావా ?

Rashi khanna posted on instagram about her new bollywood project

Raashi Khanna: బబ్లీ హీరోయిన్ రాశి ఖ‌న్నా ప్రస్తుతం చేతి నిండా ఆఫర్స్ తో మంచి జోరు మీద ఉంది. ఈ బ్యూటీ బాలీవుడ్‌ లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే చిత్రంలో నటిస్తుందని తాజాగా అప్ డేట్ వచ్చింది. సాగర్‌ అంబ్రే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాగర్‌ అంబ్రే ఏరికోరి రాశికి ఈ అవకాశం ఎందుకిచ్చాడో అని బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమ వారు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే బాలీవుడ్ ఛాన్స్ కోసం రాశి ఖ‌న్నా గత కొన్ని నెలలుగా ఈ దర్శకునితో టచ్ లో ఉందట.

టచ్ లో అంటే..ఫోన్ లో కాలింగ్, చాటింగ్ అనుకుంటున్నారా !…తప్పులో కాలేసినట్లేనండి బాబు. ఏకంగా అతనితో సింగపూర్ వెళ్లి డేటింగ్ చేసింది. ఆమెలోని టాలెంట్ ని దగ్గరగా చూసిన సాగర్‌ అంబ్రే ఛాన్స్ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా సెట్ లో కి అడుగుపెట్టిన రాశి, ఈ విషయాన్ని అభిమానులకు తెలియచేస్తూ ‘‘ఇంత సాదర స్వాగతం పలికినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు, యోధ సెట్లో…తొలిరోజు’’ అంటూ తన స్టేటస్‌ లో ఘనంగా రాసుకొచ్చింది.

ఏది ఏమైనా ఈ బబ్లీ హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ ఆ మధ్య ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా సమాప్తమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఏకంగా బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు రావటం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఎక్స్ పోజింగ్, గ్లామర్ తో మొత్తానికి ఎలాగోలా రాశి బండిని నడిపిస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోతుందనుకున్న రాశి ఇంకా ఇలానే ఉండటానికి కారణం ఏంటో ఎవరికి తెలియట్లేదు. బాలీవుడ్ లో ఏమేరకు పాగా వేస్తుందో చూద్దాం.