Rashi Khanna: సాధారణంగా అందంగా కనపడాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆశగా ఉంటుంది.ఈ క్రమంలోనే అందాన్ని పెంపొందించుకోవడంలో కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే వివిధ రకాల రసాయన ప్రొడక్టులను ఉపయోగిస్తూ అందం పెంపొందించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక హీరోయిన్ల విషయాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు తెర పై ఎంతో అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఇలా హీరోయిన్స్ అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారని మనం భావిస్తాము. అయితే హీరోయిన్
రాశీ ఖన్నా ఈ విషయంలో మాత్రం ఇలా కాదు ఈమె తన అందాన్ని పెంపొందించుకోవడంలో కోసం పాత పద్ధతులను ఉపయోగిస్తానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశీ ఖన్నా తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇలా ఈ ముద్దుగుమ్మ అందంగా కనిపించడం కోసం ఏం చేస్తుందో తాజాగా తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు అందరి మాదిరి అందం కోసం ఎక్కువ ఖర్చు చేయడం నచ్చదని తను కేవలం పాత పద్ధతులను ఉపయోగించి అందాన్ని మెరుగు పరుచుకుంటానని తెలిపారు.
పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు ఉపయోగించే ముల్తాని మట్టి, శెనగపిండి,పెరుగు కలిపి తన మొహానికి రాసుకుని తన అందాన్ని పెంపొందించుకుంటానని ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన అందం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదేనని తెలిపారు. ఇలా తన అందాన్ని పెంపొందించుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.